వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్రానికి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో పీపీపీ పద్ధతిలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. రెండో దశలో అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పాలకొల్లు, పెనుకొండల్లో కళాశాలల నిర్మాణానికి రూ.1,239.97 కోట్ల వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. దిల్లీలో అధికారుల బృందం సమర్పించిన ఈ నివేదికపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.