అమెరికాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు: ముఖ్య అతిథిగా నటుడు నవీన్ పోలిశెట్టి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Dallas
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో వేదికగా తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 17వ తేదీన కొమెరికా సెంటర్లో జరిగే ఈ మహా వేడుకలకు టాలీవుడ్ యువ హీరో నవీన్ పోలిశెట్టి ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదని, ఉచిత ప్రవేశంతో పాటు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించామని నిర్వాహకులు వెల్లడించారు.