సింగరేణి కార్మికుల భూ హక్కుల సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు శుభవార్త చెబుతూ, సొంతింటి కలను సాకారం చేసేలా రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి సంస్థ భూముల్లో దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న కార్మికుల పెండింగ్ భూ హక్కుల దరఖాస్తులను 45 రోజుల్లోగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్ ఆదేశించారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షుడిగా ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అర్హత గల దరఖాస్తులను పరిష్కరించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.