విజయనగరం లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కుల అందజేత
రిపోర్టర్: రాము
స్థలం: విజయనగరం
విజయనగరం నియోజకవర్గానికి చెందిన 8 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 6,52,767 విలువైన చెక్కులను పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఆరోగ్యరీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి ఇబ్బందిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఈ ఆర్థిక సాయం మంజూరు చేయించినట్లు తెలిపారు.