ఆసియా క్రీడలు సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ముందు భారీ లక్ష్యం నిలిపిన భారత్

రిపోర్టర్: సతీష్ స్థలం: జపాన్

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల మహిళల క్రికెట్ సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ కేవలం 49 బంతుల్లోనే 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి సెంచరీతో చెలరేగింది. మరోవైపు స్మృతి మంధాన 37 పరుగులు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 40 పరుగులు చేసి రాణించగా, బంగ్లాదేశ్ విజయానికి 196 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.