అక్టోబర్ మొదటి వారం నుంచి ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్ షూటింగ్ అప్డేట్ ఫిలింనగర్ వర్గాల్లో వైరల్ అవుతోంది. భుజానికి గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్, సంపూర్ణ ఆరోగ్యంతో అక్టోబర్ మొదటి వారం నుంచి మళ్లీ షూటింగ్లో పాల్గొననున్నారు. ఎన్టీఆర్ లేని సమయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కించడంతో ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.