భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
రిపోర్టర్: గోపి
స్థలం: భారతదేశం
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్లకు చేరువకావడం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 813 పాయింట్లు కోల్పోయి 74,764 వద్ద ముగియగా, నిఫ్టీ 203 పాయింట్లు పడిపోయి 23,431 వద్ద స్థిరపడింది. ఐటీ, రియల్టీ రంగాల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.