కొడంగల్లో మెగా రైతుమేళా ప్రారంభం: వ్యవసాయాభివృద్ధే లక్ష్యమన్న సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: వికారాబాద్
కొడంగల్ నియోజకవర్గంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి ఆయన మెగా రైతుమేళా మరియు ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ స్టాళ్లను సందర్శించి, రైతులు పండించిన పంటల వివరాలను ఆసక్తిగా పరిశీలించారు. ఆధునిక సాగు పద్ధతులను రైతులు పెద్దఎత్తున అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.