ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన: ఉద్రిక్తత మధ్య భారీగా పోలీసుల మోహరింపు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: న్యూఢిల్లీ
ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన భారీ నిరసన నేపథ్యంలో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని, జంతర్ మంతర్ వద్ద ఆందోళనను అడ్డుకునేందుకు కేంద్రం ఇరువై వేలకు పైగా భద్రతా సిబ్బందిని మోహరించిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఎలాంటి అనుమతి లేనప్పటికీ ఆందోళన నిర్వహిస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే స్పష్టం చేయడంతో, భద్రతా చర్యల్లో భాగంగా మెట్రో స్టేషన్లను మూసివేయడంతో పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.