డిగ్రీ లేకపోయినా మొక్కల పరిశోధనలో అద్భుతాలు సృష్టిస్తున్న వాయనాడ్ వాసి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: కేరళ
కేరళలోని వాయనాడ్‌కు చెందిన పిచన్ ఎం సలీమ్ ఎలాంటి వృక్షశాస్త్ర డిగ్రీ లేకపోయినా, పశ్చిమ కనుమలలో అద్భుతమైన పరిశోధనలు చేశారు. సుమారు 2 వేలకు పైగా మొక్కల శాస్త్రీయ నామాలను ఇట్టే చెప్పగల ఆయన, 23 కొత్త మొక్కల జాతులను కనుగొన్నారు. శతాబ్దాల నాటి అరుదైన మొక్క రహస్యాన్ని చేధించిన ఆయన సేవలకు గాను రాష్ట్రపతి చేతుల మీదుగా ప్లాంట్ జీనోమ్ సేవియర్ అవార్డు అందుకున్నారు.