యూరిక్ యాసిడ్ సమస్యకు శాస్త్రవేత్తల సరికొత్త నానోపార్టికల్ చికిత్స

రిపోర్టర్: కృష్ణ స్థలం: World

యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే గౌట్ వ్యాధికి చైనాలోని షాంఘై జియావో టోంగ్ యూనివర్సిటీ పరిశోధకులు వినూత్న చికిత్సను కనుగొన్నారు. సీరియం ఆధారిత నానోపార్టికల్స్ (UCCN) ద్వారా యూరిక్ యాసిడ్‌ను వేగంగా కరిగించడమే కాకుండా, కీళ్ల వాపు, నొప్పిని తగ్గించి కొత్త స్పటికాలు ఏర్పడకుండా ఈ మందు అడ్డుకుంటుంది. ఇది భవిష్యత్తులో కీళ్ల వాతం రోగులకు గొప్ప ఉపశమనం కలిగించనుంది.