యూపీలో బీజేపీ పట్టు కోల్పోకుండా అధిష్టానం బహుముఖ వ్యూహం
రిపోర్టర్: సురేష్
స్థలం: Lucknow
దేశ రాజకీయాల్ లో కీలకమైన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ పట్టు సడలకుండా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జాతీయ అధిష్టానం బహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. సమాజ్ వాది పార్టీ అనుసరిస్తున్న సామాజిక ఇంజనీరింగ్ సమీకరణాలను తిప్పికొట్టేందుకు, అసంతృప్తిని చల్లార్చేందుకు కూటమి భాగస్వామ్య పక్షాలతో సమన్వయం పెంచుకుంటూ పరిపాలనా వేగాన్ని పెంచే దిశగా కషాయ పార్టీ అడుగులు వేస్తోంది.