'ప్రభాకర్‌పై త్రీమెన్ కమిటీ వేశాం.. రిపోర్ట్ రాగానే చర్యలు': అధికారిక ప్రకటన

రిపోర్టర్: నరేష్ స్థలం: Andhra Pradesh

మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా ప్రభాకర్‌పై సుమోటోగా కేసు స్వీకరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ వ్యవహారంపై విచారణకు త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ నుంచి నివేదిక రాగానే ప్రభాకర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అలాగే డీఎస్సీ పరీక్షలను ఎటువంటి చిన్న పొరపాటుకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించామని ప్రభుత్వం ప్రకటించింది.