రెండు వేల ఇత్తడి సూక్ష్మ గణపతులతో తిరుపతిలో ప్రత్యేక విగ్రహం
రిపోర్టర్: సునీల్
స్థలం: తిరుపతి
తిరుపతి కస్తూర్బావీధిలో వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాబోయే కొత్త సంవత్సరాన్ని ప్రతిబింబించేలా అచ్చంగా 2,026 ఇత్తడి సూక్ష్మ గణపతులతో ఈ విగ్రహాన్ని అత్యంత ఆకర్షణీయంగా రూపొందించారు. భక్తులను ఈ సూక్ష్మ గణపతుల కళాఖండం ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సరికొత్త రూపం తిరుపతిలో విశేషంగా నిలుస్తోంది.