హైదరాబాద్ లో దారుణం: అత్తింటి కుటుంబంపై కత్తితో దాడిలో ఇద్దరు మృతి
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాల నేపథ్యంలో సిద్ధిఖ్ అనే వ్యక్తి అత్తింటి కుటుంబంపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటనలో అత్త నిరంజన్బీతో పాటు బావమరిది భార్య రేష్మా ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. ప్రాణ రక్షణ కోరినా పోలీసులను ఆశ్రయించిన కొద్దిసేపటికే ఈ హత్యలు జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.