ఆసియా క్రీడల నుంచి తొలగింపుపై వుషు అథ్లెట్ దివ్యాన్షి కన్నీరు

రిపోర్టర్: రాజేష్ స్థలం: India

ఆసియా గేమ్స్ నుంచి తనను ఉద్దేశపూర్వకంగా తొలగించారంటూ వుషు అథ్లెట్ దివ్యాన్షి కన్నీటి పర్యంతమయ్యారు. సెలక్షన్స్‌లో ఓడించిన రోషిబినా దేవి తనను కుట్ర చేసి గాయపరిచిందని ఆమె ఆరోపించారు. తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, బతికే ఉద్దేశం లేదంటూ సోషల్ మీడియాలో భావోద్వేగ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. అయితే గాయం కారణంగానే ఆమెను తప్పించినట్లు ఫెడరేషన్ స్పష్టం చేసింది.