రాష్ట్రస్థాయి కబాడీ పోటీల్లో పాల్గొన్న రమాదేవికి ఘన సన్మానం

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

గ్రేటర్ విశాఖ 106వ వార్డు సాలాపువానిపాలెంలో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కబాడీ పోటీల్లో పాల్గొన్న అనకాపల్లి పార్లమెంట్ సాధక్ ప్రతినిధి గొన్న రమాదేవిని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ క్రీడా పోటీల నిర్వహణలో భాగంగా ఆమె ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. దైవ మరియు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారని కమిటీ సభ్యులు ఆమెను కొనియాడారు.