ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలంటూ జనసేన జాతీయ కార్యదర్శికి హబీబ్ పాషా వినతి

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిధిలో ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించి వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ జనసేన జాతీయ కార్యదర్శి తల్లూరి రాముకు సంఘం నాయకుడు హబీబ్ పాషా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తల్లూరి రాము మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7.50 లక్షల మంది ఆటో కార్మికుల సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై పోరాటం తీవ్రతరం చేస్తామని హబీబ్ పాషా హెచ్చరించారు.