ఏపీలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
రిపోర్టర్: సతీష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 26 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎఫ్‌ఎస్‌ఓ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. రాత పరీక్ష, వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.