రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దిల్లీలో పలువురు దిగ్గజ సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేశ్ భేటీ

రిపోర్టర్: కృష్ణ స్థలం: దిల్లీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ దిల్లీలో పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. తిరుపతిలో వివో మొబైల్స్ కాంపొనెస్ తయారీ కేంద్రం ఏర్పాటుతో పాటు విశాఖను నేషనల్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ఐసీసీ ఛైర్మన్ జై షాను కోరారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కూడా ఆయన భేటీ అయ్యారు.