యాదగిరిగుట్ట శివాలయంలో భక్తిశ్రద్ధలతో వైభవంగా చండీ హోమం
రిపోర్టర్: P.srinu
స్థలం: యాదాద్రి భువనగిరి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కొండపై ఉన్న రామలింగేశ్వర స్వామి సన్నిధిలో శుక్రవారం చండీ హోమం అత్యంత వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రులయ్యారు.