వెబ్ సిరీస్‌గా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 3
రిపోర్టర్: గోపి
స్థలం: ముంబై
బాలీవుడ్ ప్రముఖ ఫ్రాంచైజీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూడో భాగం థియేటర్లలో కాకుండా ఓటీటీ వెబ్ సిరీస్‌గా రానుంది. ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో షనయా కపూర్ నటిస్తోంది. రీమా మాయా దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ మునుపటి చిత్రాల కంటే భిన్నంగా డార్క్, ఇంటెన్స్ జోనర్లో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.