కార్ల తయారీలో కీలక మార్పులు: 2027 నుంచి సీఏఎఫ్ఈ 3 నిబంధనలు అమలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: New Delhi
చమురు దిగుమతులు తగ్గించడం మరియు కర్బన ఉద్గారాలను కట్టడి చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కార్ల ఉత్పత్తులపై సరికొత్త నిబంధనలను తీసుకొస్తోందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ అధికారులు తెలిపారు. 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న సీఏఎఫ్ఈ 3 మార్గదర్శకాల ప్రకారం కార్ల మైలేజీని భారీగా పెంచడంతో పాటు ఉద్గారాలను గణనీయంగా తగ్గించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.