స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్ గడువు పొడిగింపునకు కేంద్రం ప్రకటన
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
పాఠశాలల కోసం నిర్వహించే స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ 2026 రిజిస్ట్రేషన్ మరియు దరఖాస్తుల సమర్పణ గడువును పొడిగిస్తూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంకా దరఖాస్తు చేసుకోని పాఠశాలలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. పాఠశాలల్లో పరిశుభ్రత, హరిత వాతావరణాన్ని ప్రోత్సహించే ఈ గుర్తింపు ప్రక్రియ కోసం ఆసక్తిగల పాఠశాలల యాజమాన్యాలు వెంటనే దరఖాస్తులు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. గడువు పెంపు నిర్ణయంతో మరిన్ని విద్యాసంస్థలు ఈ కార్యక్రమం లో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.