రామన్నపేట కోర్టులో బతుకమ్మ సంబరాలతో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని శనివారం రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి జి.సబిత హాజరై పూల పండుగ విశిష్టతను చాటారు. న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, సిబ్బంది కుటుంబసభ్యులతో కలిసి ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మలాటలతో కోర్టు ప్రాంగణాన్ని పండుగ శోభతో కళకళలాడించారు.