అధిక ధరకు బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
అధిక ధరలకు బియ్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల మెయిన్ రోడ్డు లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు లోబడి బియ్యం విక్రయించే నూతన అవుట్‌లెట్‌ను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ట ధరలకు మించి విక్రయాలు జరపకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.