బెల్లంపల్లి నియోజకవర్గ ఎస్సీ సెల్ నూతన నియామకాలు తాత్కాలికంగా నిలిపివేత

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో ఇటీవల ప్రకటించిన ఎస్సీ సెల్ నియోజకవర్గ, మండల, పట్టణ అధ్యక్షుల నియామకాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్రెడ్డి, ఎస్సీ సెల్ చైర్మన్ పైడిమల్ల నర్సింగ చర్చల అనంతరం ఈ సంయుక్త నిర్ణయం తీసుకున్నారు. దసరా పండుగ తర్వాత స్థానిక నాయకులతో సమగ్రంగా చర్చించి తుది నియామకాలను అధికారికంగా ప్రకటిస్తామని వారు స్పష్టం చేశారు.