గోపాలాపట్నం చోరీ కేసులో బంగారు మంగళసూత్రం రికవరీ చేసిన విశాఖ పోలీసులు
రిపోర్టర్: సునీల్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం నగరంలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి ఛేదించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది, దొంగతనానికి గురైన ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల విలువైన బంగారు మంగళసూత్రాన్ని విజయవంతంగా రికవరీ చేసినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. పోలీసుల సకాల స్పందనపై బాధితురాలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు విశాఖ నగర పోలీసులు వివరాలను వెల్లడించారు.