ఎలక్ట్రిక్ వాహనాలకు తప్పనిసరి శబ్దం: కేంద్రం కీలక నిర్ణయం వెల్లడి
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూఢిల్లీ
ఎలక్ట్రిక్ వాహనాల నిశ్శబ్ద ప్రయాణంతో పాదచారులకు ఎదురవుతున్న ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన నిబంధనలను అమల్లోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా నిర్దేశిత ఎలక్ట్రిక్ కార్లు, గూడ్స్ వాహనాలకు అకౌస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్ ను తప్పనిసరి చేశామని వెల్లడించారు. తక్కువ వేగంతో కదులుతున్నప్పుడు ఈ వ్యవస్థ ద్వారా ప్రత్యేక హెచ్చరిక శబ్దం వెలువడుతుందని, దీనివల్ల రోడ్డుపై నడిచేవారు అప్రమత్తం కావడానికి అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు.