సన్న రకం వరి సాగు.. బోనస్ కోసం నమోదుకు గడువు పెంపు

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్ మండలంలో ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఏడు రకాల సన్న వరి సాగు చేసిన రైతులు, క్వింటాలుకు రూ.500 బోనస్ పొందేందుకు ఈనెల 10వ తేదీలోపు తప్పనిసరిగా ఆన్లైన్ నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారి పి.శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

రైతులు తమ పంట వివరాలను విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్ల వద్ద లేదా సంబంధిత ఏఈఓలను కలిసి నమోదు చేసుకోవాలి. గడువులోపు నమోదు చేసుకోని వారికి బోనస్ వర్తించదని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.