స్వర్ణ పతకంతో మెరిసిన బ్యాดమింటన్ క్రీడాకారిణి దండు పూజ

రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు స్థలం: తిరుపతి అర్బన్

బెంగళూరులో నిర్వహించిన 80వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్–2026లో ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రీడాకారిణి దండు పూజ ఉమెన్స్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో బంగారు పతకం సాధించడం పట్ల శాప్ చైర్మన్ రవి నాయుడు గారు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కీర్తి తెచ్చిన పూజను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులు నిరంతర సాధనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని రవి నాయుడు ఆకాంక్షించారు.