రామ్లీలా మైదాన్ నిరసనకు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు: అభిజిత్ దిప్కే ప్రకటన

రిపోర్టర్: సురేష్ స్థలం: న్యూఢిల్లీ

ఎన్నికల అవకతవకలపై ఇండియా కూటమి తలపెట్టిన నిరసనకు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు ఇస్తోందని వ్యవస్థాపకులు అభిజిత్ దిప్కే తెలిపారు. అయితే ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ లో జరిగే భారీ రాలీలో తమ పార్టీ పాల్గొనదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా తటస్థంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీలో మమతా బెనర్జీతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన వెల్లడించారు.