వినాయక నిమజ్జన వేడుకల భద్రతకు పకడ్బందీ ఏర్పాట్లు

రిపోర్టర్: SK స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లిలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. డీసీపీ బి.రామ్ రెడ్డి మాట్లాడుతూ భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అధికారులతో కలిసి మినీ ట్యాంక్బండ్ ప్రాంతాన్ని పరిశీలించి తగిన సూచనలు చేశారని తెలిపారు.