ఆత్మకూరు ఎంవీఐ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఆత్మకూరు

ఆత్మకూరు మోటారు వాహన తనిఖీ అధికారి కార్యాలయంలో గురువారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంవీఐ ఎం. రాములు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస సిద్ధాంతాలతో దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ మహాత్ముడి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.