కరీంనగర్ బస్ స్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ

రిపోర్టర్: కిరణ్ స్థలం: సిద్దిపేట

కరీంనగర్ బస్స్టేషన్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని పొన్నం ప్రభాకర్ - మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వెల్లడించారు. తాను 2013లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఆ బస్స్టేషన్కు అంబేద్కర్ పేరు పెట్టుకున్నామని ఆయన గుర్తుచేశారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే సమానత్వం, సామాజిక న్యాయం ముందుకు సాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఇందిరా భవన్లో జరిగిన గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం తొలి మహాసభలోనూ ఆయన పాల్గొన్నారు.