ప్రభాస్‌కు కేటీఆర్ అండ్ గ్యాంగ్ ఫన్నీ ప్రాంక్ కాల్
రిపోర్టర్: హరి
స్థలం: తెలంగాణ
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఒక టాక్ షోలో పాల్గొన్న సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు సరదాగా ఫోన్ చేశారు. అక్కడున్న చిన్నారులు రోడ్డుపై ఫోన్ దొరికిందంటూ ప్రభాస్‌కు ప్రాంక్ కాల్ చేయగా, ఆయన వెంటనే కాల్ కట్ చేశారు. ఆ తర్వాత కేటీఆర్ అసలు విషయం చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.