ఏషియన్ పారా గేమ్స్: క్రీడాకారుల సన్నాహాల్లో గందరగోళం మరియు తీవ్ర జాప్యం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: న్యూఢిల్లీ
ఏషియన్ పారా గేమ్స్ ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్న తరుణంలో భారత క్రీడాకారుల సన్నాహాలు వివాదాలు మరియు పరిపాలనాపరమైన జాప్యంతో గందరగోళంగా మారాయని అధికారులు తెలిపారు. ముఖ్య కోచ్ తొలగింపుపై పారా షూటర్లు క్రీడా ప్రాధికార సంస్ధ అధికారులను కలసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కిట్ల పంపిణీలో జరిగిన జాప్యం పట్ల క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్నారు.