భారీ వర్షాలతో జలకళ సంతరించుకున్న ప్రత్తిపాడు సుబ్బారెడ్డి సాగర్ ప్రాజెక్టు

రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్ స్థలం: ప్రత్తిపాడు

ప్రత్తిపాడు మండలంలోని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు సుబ్బారెడ్డి సాగర్కు భారీ వర్షాలతో వరదనీరు చేరడంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. గత కొంతకాలంగా వర్షాభావ పరిస్థితులతో సాగునీటిపై ఆందోళన చెందిన రైతులకు తాజా వర్షాలు ఊరటనిచ్చాయి. సాగర్లో నీటి నిల్వలు పెరుగుతుండటంతో పరిసర ప్రాంతాల రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వర్షాలు కొనసాగితే పంటల సాగుకు సాగునీటి ఇబ్బందులు తగ్గే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు