భక్తి శ్రద్ధలతో ముగిసిన వినాయక మహా కుంభ నైవేద్య వేడుకలు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండల కేంద్రంలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో విగ్నేశ్వర స్వామి వారికి శనివారం ప్రీతికరమైన చిత్రాన్న మహా కుంభ నైవేద్య నివేదన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు ఈ వేడుకను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నంగునూరు సత్యనారాయణ జగదాంబ దంపతులు ప్రత్యేక పూజలు చేయగా, మహిళలు మంగళహారతులతో స్వామివారిని కొలిచారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని 18 కిలోల చిత్రాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.