తుఫాన్ ముప్పు: పోలీసు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశం
రిపోర్టర్: విజయ్
స్థలం: శ్రీకాకుళం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా పోలీసు వెల్లడించారు. తుఫాన్ ప్రభావం దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశించారు. భారత వాతావరణ శాఖ మరియు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ తగిన చర్యలు చేపట్టాలని ఎస్పీ స్పష్టం చేశారు.