విద్యార్థుల స్వరం బలపడితేనే దేశ భవిష్యత్తు రాహుల్ గాంధీ

రిపోర్టర్: రాము స్థలం: ఇండోర్

విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తు అని, వారి కలలకు రెక్కలు తొడిగినప్పుడే దేశానికి నిజమైన బలం వస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇండోర్ లో నిర్వహించిన ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎదగకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదన్నారు. విద్యార్థుల స్వరం బలపడితేనే దేశ భవిష్యత్తు బలపడుతుందని ఆయన స్పష్టం చేశారు.