ఏపీలో పెట్టుబడుల జోరు: ఐదు ప్రాంతీయ సదస్సులతో లక్షన్నర ఉద్యోగాలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలలో నిర్వహించిన ఐదు ప్రాంతీయ సదస్సుల ద్వారా సుమారు లక్షా యాభై ఆరు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ సదస్సుల్ లో వివిధ సంస్థలు ప్రభుత్వంతో నూట తొంబై ఐదు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, దీని ద్వారా ఎనుబది ఐదు వేల ఐదు వందల అరవై ఒకటి కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని అధికారులు తెలిపారు. పరిశ్రమల స్థాపన వరకు ఒప్పందాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.