మీనాక్షి నటరాజన్ పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాలని కోరుతూ బాధితురాలు శ్రీలత నాంపల్లి కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఆమెపై ఇప్పటికే రెండు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నందున విదేశీ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకోవాలని పిటిషనర్ కోరారు. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారు విదేశాలకు వెళ్తే న్యాయ ప్రక్రియకు అంతరాయం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.