టికెట్ అడగినందుకు టీసీపై ప్రయాణికుడి దాడి, తీవ్ర గాయాలు
రిపోర్టర్: రాము
స్థలం: మహారాష్ట్ర
ముంబైలోని జోగేశ్వరి రైల్వే స్టేషన్లో టికెట్ లేని ప్రయాణికుడిని ప్రశ్నించినందుకు వెస్ట్రన్ రైల్వే టికెట్ కలెక్టర్ ఆశిష్ రంజన్ గుప్తాపై అజయ్ ధివర్ అనే వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేశాడు. జరిమానా చెల్లించాలనడంతో పాటు ఆర్ఎఫ్ఈ కార్యాలయానికి రమ్మన్నందుకు ఆగ్రహించిన ప్రయాణికుడు గుప్తా ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన టీసీకి కంటి కింద ఏడు కుట్లు పడ్డాయి. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.