భిక్షాటనే వరం: ఆలయానికి లక్షల విరాళం ఇచ్చిన భక్తుడు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: త్రిపురాంతకం

భిక్షాటన చేస్తూ వచ్చిన ప్రతి రూపాయిని భక్తుల సేవలకే కేటాయిస్తున్నారు తమిళనాడుకు చెందిన శివ రాముడు రెడ్డియార్. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం బాల త్రిపుర సుందరి దేవి ఆలయం వద్ద ఆయన భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. ఇలా ఐదేళ్లపాటు కూడబెట్టిన లక్షా డెబ్బై వేల రూపాయలతో ఆలయంలో ఇనుప క్యూ లైన్లు ఏర్పాటు చేయించినట్లు శివ రాముడు రెడ్డియార్ తెలిపారు. తనకు ఎలాంటి దురలవాట్లు లేవని, అమ్మవారి సేవలోనే తనువు చాలిస్తానని శివ రాముడు రెడ్డియార్ ఆవేదన వ్యక్తం చేశారు.