గుర్గావ్లోని ఆలయంలో భారీ చోరీ చేసి మాజీ సెక్యూరిటీ గార్డు అరెస్ట్

రిపోర్టర్: గోపి స్థలం: Gurgaon

గుర్గావ్లోని సుదర్శన్ మాత ఆలయంలో పన్నెండు సంవత్సరాలు సెక్యూరిటీ గార్డుగా పనిచేసి మానేసిన రోహతాష్ అనే వ్యక్తి ఆలయంలోకి చొరబడి నాలుగు కిలోల వెండి ఆభరణాలు, ముప్పై నాలుగు వేల రూపాయల నగదును అపహరించాడని పోలీసులు తెలిపారు. ఆలయ పూజారి సమాచారంతో సీసీటీవీ పుటేజీ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు కేవలం ఆరు గంటల్లోనే నిందితుడిని రోతక్ లోని అతని స్వగ్రామంలో అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నారని వెస్ట్ డీసీపీ వైవీఆర్ శశి శేఖర్ పేర్కొన్నారు.