ఓట్ల తొలగింపు కోసమే ఎస్ఐఆర్ ప్రక్రియంటూ మండిపడ్డ ఎమ్మెల్యే అనిల్

రిపోర్టర్: P.srinu స్థలం: భువనగిరి

భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్లో ఏఐసీసీ పిలుపు మేరకు ఓటు బచావో దేశ్ బచావో కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్ల నమోదు కోసం కాదని, ఓట్ల తొలగింపు లక్ష్యంగా సాగుతోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు.