వైరల్ వీడియో కలకలం: కొడుకు, కోడలు గెంటేశారంటూ వృద్ధ దంపతుల కన్నీటి గోడు

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఆగ్రా

కొడుకు, కోడలు తమను ఇంటి నుంచి గెంటేశారంటూ ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన రామ్ విలాస్ కటారా, ఉష కటారా దంపతులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. తమకు న్యాయం చేయాలని కోరుతూ గత మూడేళ్లలో వెయ్యికి పైగా వీడియోలు చేసినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన ఆగ్రా పోలీసులు, ఇదొక కుటుంబ ఆస్తి వివాదమని, ప్రస్తుతం కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని వెల్లడించారు.