స్థానిక సంస్థల ఎన్నికలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర నిప్పులు

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఎన్నికల్లో జరుగుతున్న దాడులు, అరాచకాలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్ఈసీ ఆదేశించినా రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించడంలేదని, ఏపీ పరువును అధికారులు బజారుకీడ్చారని పేర్ని నాని ధ్వజమెత్తారు. పొత్తుల పేరుతో జనసేన, బీజేపీ నాయకులను చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.