బీసీల అభ్యున్నతికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందంటూ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టీకరణ

రిపోర్టర్: కిరణ్ స్థలం: కృష్ణా

సమాజంలో యాభై శాతం కంటే ఎక్కువగా ఉన్న వెనకబడిన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా మరియు సామాజికంగా పైకి తెచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అనేక మార్పులు చేసిందని గనుల, ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర వెల్లడించారు. గతంలో ఎన్టీఆర్ ఇరవై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్లు తెస్తే, తాము ముప్పై నాలుగు శాతానికి పెంచామని, నూతన సంస్కరణలతో పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు.